ముగియనున్న స్వరూపానంద సరస్వతి పదవీకాలం.. 26 ఏళ్ల బాలస్వామికి బాధ్యతలు
Advertisement
విశాఖ శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి పదవి త్వరలోనే ముగియనుంది. ఈ నేపథ్యంలో తన శిష్యుడైన 26 ఏళ్ల కిరణ్ కుమార్ శర్మ (బాలస్వామి)ని ఉత్తరాధికారిగా నియమించాలని ఆయన నిర్ణయించారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో విజయవాడలోని కృష్ణానది కరకట్టపై ఉత్తరాధికారి శిష్య తురీయాశ్రమ దీక్షా స్వీకార మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఇరు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్, ఇతర ప్రముఖులతో పాటు భారీ సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు.

విశాఖ జిల్లా భీమునిపట్నంలో పోణంగి హనుమంతరావు, ప్రభావతమ్మ దంపతులకు 1993 ఏప్రిల్ 4న బాలస్వామి జన్మించారు. మూడో తరగతి చదువుతున్న సమయంలో పీఠానికి చేరుకున్న బాలస్వామి... స్వరూపానందస్వామికి ప్రధాన శిష్యుడిగా ఎదిగారు.
Wed, Jun 12, 2019, 12:46 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View