నితిన్ 'భీష్మ' సినిమా లాంచ్
Advertisement
వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ 'భీష్మ' సినిమా చేయనున్నాడనే విషయం తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా కొంతకాలం క్రితమే రష్మిక మందనను ఎంపిక చేశారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఆమెకి ఇది రెండవ సినిమా. కొంతసేపటి క్రితం ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ నెల 20వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలెట్టనున్నారు.

వెంకీ కుడుముల నుంచి ఇంతకుముందు వచ్చిన 'ఛలో' అనే ప్రేమకథాంశం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఈ సారి కూడా ఆయన అదే తరహా కథను సెట్ చేసుకున్నాడు. రొమాంటిక్ లవ్ స్టోరీగా ఆయన 'భీష్మ'ను రూపొందిస్తున్నాడు. కొంతకాలంగా సక్సెస్ అనే మాట వినని నితిన్, ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొడతాననే నమ్మకంతో వున్నాడు. ఆయన కోరిక నెరవేరుతుందేమో చూడాలి మరి.
Wed, Jun 12, 2019, 12:45 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View