'సైరా' కోసం కీలక సన్నివేశాల చిత్రీకరణ
Advertisement
చిరంజీవి కథానాయకుడిగా 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో చరణ్ 'సైరా' సినిమాను నిర్మిస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ప్రస్తుతం 'పాండిచ్చేరి'లో షూటింగు జరుపుకుంటోంది.

 బ్రిటిష్ కాలానికి చెందిన కొన్ని భవనాలు అక్కడ ఉండటంతో, ఆ నేపథ్యంలో వచ్చే కొన్ని సన్నివేశాలను అక్కడే ప్లాన్ చేశారట. నరసింహా రెడ్డి బృందానికి .. ఆంగ్లేయ అధికారులకు మధ్య జరిగే ఒప్పందానికి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని సమాచారం. చిరంజీవి పుట్టినరోజైన ఆగస్టు 22వ తేదీన ఈ సినిమా నుంచి టీజర్ ను వదలడమే కాకుండా, విడుదల తేదీని కూడా ప్రకటించనున్నట్టుగా తెలుస్తోంది. అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేయవచ్చనే అనుకుంటున్నారు. 
Wed, Jun 12, 2019, 11:54 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View