పాత్ర నచ్చకపోతే సెట్ నుంచి వెనక్కి వచ్చేసిన సందర్భాలు వున్నాయి: నటుడు అజయ్
Advertisement
తెలుగులో విభిన్నమైన పాత్రల ద్వారా ప్రేక్షకులను మెప్పించిన నటుడిగా అజయ్ కనిపిస్తాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన కెరియర్ ను గురించిన విషయాలను ప్రస్తావించాడు. "చాలా మంది దర్శకులు నాకు మంచి మంచి పాత్రలనిస్తూ ప్రోత్సహించారు. ఆ దర్శకులతో కలిసి పనిచేయడం వలన, నేను ఎన్నో విషయాలను నేర్చుకున్నాను.

అప్పట్లో .. నా పాత్ర ఏమిటనేది నేను సెట్ కి వెళ్లిన తరువాత తెలుసుకునేవాడిని. చాలాకాలం వరకూ ఇదే పద్ధతిని కొనసాగించాను. ఒకటి రెండు సార్లు మాత్రం, నాకు ఇచ్చిన పాత్ర నచ్చక సెట్ నుంచి వచ్చేశాను. అవి పెద్ద హీరోల సినిమాలు కావడం విశేషం. అప్పటి నుంచి నా పాత్ర ఏమిటి? అనే విషయాన్ని వివరంగా తెలుసుకునే ఓకే చెబుతున్నాను" అని అన్నారు. 
Wed, Jun 12, 2019, 11:32 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View