సంక్రాంతికి 'దర్బార్' సందడి షురూ
Advertisement
రజనీకాంత్ - మురుగదాస్ కాంబినేషన్లో 'దర్బార్' సినిమా రూపొందుతోంది. విభిన్నమైన కథాకథనాలతో లైకా ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగును ఆగస్టులో పూర్తిచేయనున్నట్టుగా మురుగదాస్ చెప్పాడు. ముందుగా అనుకున్నట్టుగానే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నామని అన్నాడు. దాంతో రజనీ సంక్రాంతి బరిలోకి దిగడమనేది ఖరారైపోయింది.

నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, నివేదా థామస్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించనుంది. అనిరుధ్ సంగీతం .. సంతోష్ శివన్ ఫొటోగ్రఫీ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని అంటున్నారు. 'పేట' హిట్ తరువాత రజనీ నుంచి వస్తోన్న సినిమా కావడంతో, ఈ సినిమా పట్ల అంతా ఆసక్తితో వున్నారు.
Wed, Jun 12, 2019, 10:54 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View