కల్యాణ్ రామ్ కొత్త సినిమాకి రంగం సిద్ధం
Advertisement
ప్రస్తుతం కల్యాణ్ రామ్ కథానాయకుడిగా మల్లిడి వేణు దర్శకత్వంలో 'తుగ్లక్' సినిమా రూపొందుతోంది. ఈ సినిమా తరువాత కల్యాణ్ రామ్ .. సతీశ్ వేగేశ్నతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో కథానాయికగా మెహ్రీన్ ను తీసుకున్నట్టుగా ప్రచారం జరిగింది.

తాజాగా ఈ ప్రాజెక్టు ఖాయమైనట్టుగా ఒక అధికారిక ప్రకటన వచ్చింది. ఆదిత్య మ్యూజిక్ వారు తొలిసారిగా నిర్మాణ రంగంలోకి ప్రవేశించి ఈ సినిమాను నిర్మిస్తుండగా, శివలెంక కృష్ణప్రసాద్ సమర్పకుడిగా వ్యవహరించనున్నారు. గోపీసుందర్ సంగీత దర్శకుడిగా చేస్తోన్న ఈ సినిమా, త్వరలోనే రెగ్యులర్ షూటింగుకి వెళ్లనుంది. సతీశ్ వేగేశ్న నుంచి గతంలో వచ్చిన చిత్రాల మాదిరిగానే ఇది కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడం విశేషం.
Wed, Jun 12, 2019, 10:31 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View