సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Advertisement
*  తనకు డ్యాన్స్ ప్రధానంగా సాగే చిత్రంలో నటించాలని వుందని చెబుతోంది కథానాయిక తమన్నా. 'నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అందుకే డ్యాన్స్ చుట్టూ తిరిగే కథతో రూపొందే లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటించాలని వుంది' అని చెప్పింది తమ్మూ.
*  చిరంజీవి నటిస్తున్న భారీ చిత్రం 'సైరా' షూటింగ్ ప్రస్తుతం పాండిచ్చేరిలో జరుగుతోంది. ప్రధాన తారాగణంపై అక్కడ కీలక సన్నివేశాలను దర్శకుడు సురేందర్ రెడ్డి చిత్రీకరిస్తున్నాడు. ఇందులో నయనతార, తమన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
*  మంచు విష్ణు నటించిన 'ఓటర్' చిత్రం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. కార్తీక్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సురభి నాయికగా నటించింది. పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని తమిళంలో కూడా రిలీజ్ చేస్తున్నారు.
Wed, Jun 12, 2019, 07:20 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View