స్వరూపానంద సరస్వతి వ్యాఖ్యలపై గాయని సునీత అభ్యంతరం!
Advertisement
సినీ ప్రముఖులు చిరంజీవి, రజనీకాంత్ తదితర సెలెబ్రిటీలతో పాటు గాయని ఉపద్రష్ట సునీత తన వద్దకు వస్తుంటారని శ్రీ శారదపీఠాధిపతి స్వరూపానంద సరస్వతి ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇటీవల వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై గాయని సునీత అభ్యంతరం వ్యక్తం చేశారు.

స్వరూపానంద సరస్వతిని తానెప్పుడూ కలవలేదని అన్నారు. యూట్యూబ్ లో ఈ ఇంటర్వ్యూ చూసిన సునీత స్పందిస్తూ తాజాగా తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. రోజూ ఎన్నో వదంతులు వినిపిస్తుంటాయని, అయితే, కొన్నింటిపైనే స్పందించాల్సిన అవసరం వస్తుందని అన్నారు. ప్రముఖ వ్యక్తి స్వరూపానందేంద్ర సరస్వతిని సందర్శించే వారి జాబితాలో ఆయన తన పేరును చేర్చడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు. స్వరూపానంద ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియోను కూడా సునీత పోస్ట్ చేశారు.

Tue, Jun 11, 2019, 09:08 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View