కొత్త కథతోనే సెట్స్ పైకి వెళుతోన్న బాలకృష్ణ
Advertisement
బాలకృష్ణ - కేఎస్ రవికుమార్ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనుందనే సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సి.కల్యాణ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఈ నెల 13వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమాకి ముందుగా ఒక కథను అనుకున్నారు. అయితే అంతా రెడీ అనుకున్న తరువాత, కొన్ని కారణాల వలన ఆ కథను పక్కన పెట్టేయవలసి వచ్చింది. దాంతో సహజంగానే ఆ కథ కోసం అనుకున్న 'రూలర్' టైటిల్ కూడా పక్కకి వెళ్లిపోయింది. ఇప్పుడు బాలకృష్ణ కొత్త కథతోనే సెట్స్ పైకి వెళుతున్నారట. పరుచూరి మురళి వినిపించిన కథ నచ్చడంతో, బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని అంటున్నారు. వచ్చేనెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. అక్టోబర్ నాటికి షూటింగును పూర్తిచేసి, సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.
Tue, Jun 11, 2019, 05:48 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View