సినిమా ఆఫీసుల చుట్టూ విపరీతంగా తిరిగాను .. కొంతమంది మనసు కరగలేదు: 'జబర్దస్త్' నవీన్
Advertisement
'జబర్దస్త్' కామెడీ షోతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న 'గెడ్డం నవీన్', తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అవకాశాల కోసం తాను పడిన కష్టాలను గురించి ప్రస్తావించాడు. "అవకాశాల కోసం నేను సినిమాల ఆఫీసుల చుట్టూ విపరీతంగా తిరిగాను. ఎప్పటికప్పుడు కొత్తగా ఫొటోలు ఇస్తూ వెళ్లేవాడిని. కొంతమంది మనసు కరిగి ఏదో ఒక వేషం ఇచ్చేవారు. ఇప్పటికీ మనసు కరగని వాళ్లూ వున్నారు.

వీవీ వినాయక్ .. జి.నాగేశ్వరరెడ్డి నాకు అవకాశాలు ఇస్తూ వస్తున్నారు. ఈ మధ్య అనిల్ రావిపూడి గారు కూడా నాకు వేషాలు ఇస్తున్నారు. వీళ్లందరికీ నేను ఎంతో రుణపడి వుంటాను. నేను ఈ స్థాయికి రావడానికి కారణమైన 'జబర్దస్త్'ను ఎప్పటికీ మరచిపోను. 'జబర్దస్త్'తో నా ప్రయాణం ఇలా కొనసాగుతూనే ఉంటుంది" అని చెప్పుకొచ్చాడు.
Tue, Jun 11, 2019, 05:18 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View