సీఎల్పీ విలీనంపై స్పీకర్ స్పందించక పోవడం దారుణం: టీజేఎస్ అధినేత కోదండరాం
08-06-2019 Sat 13:50
- అధికార పార్టీకి అనుగుణంగా వ్యవహరిస్తున్న స్పీకర్
- ఇది ప్రజాస్వామ్య వైఖరికి విరుద్ధం
- ఇటువంటి వైఖరితో న్యాయం ఎలా జరుగుతుంది?

టీఆర్ఎస్ లో సీఎల్పీ విలీనంపై హైదరాబాద్, ఇందిరాపార్కు వద్ద టీ కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనకు టీడీపీ, టీజేఎస్ మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ, పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేయడంపై ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేసినా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ స్పందించకపోవడం దారుణమని అన్నారు. స్వతంత్రంగా పని చేయాల్సిన స్పీకర్ అధికార పార్టీకి అనుగుణంగా వ్యవహరిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్య వైఖరికి విరుద్ధమని ధ్వజమెత్తారు. ఇటువంటి వైఖరితో సభలో తమకు ఎలా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు.
More Latest News
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను పరామర్శించిన సీఎం జగన్ దంపతులు
2 hours ago

వీల్ చెయిర్ లో ఉండి కూడా ఆనంద పారవశ్యంతో డ్యాన్స్ చేసిన రాకేశ్ ఝున్ ఝున్ వాలా... వీడియో ఇదిగో!
3 hours ago

మనందరికీ ఏదో ఒక ఉమ్మడి అంశం ఉంటుంది... అదే మనందరినీ ఒకటిగా కలుపుతుంది: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
4 hours ago

మంత్రిత్వ శాఖలు కేటాయించిన మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే... ఫడ్నవీస్ కు హోం, ఆర్థిక శాఖలు
4 hours ago
