ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతోన్న రకుల్

30-05-2019 Thu 10:53
advertisement

తెలుగులో స్టార్ హీరోయిన్ గా రకుల్ తన జోరును కొనసాగిస్తోంది. ఇక తమిళంలోను తన సత్తాను చాటుకునే ప్రయత్నాల్లో కొంతవరకూ సక్సెస్ అయింది. ఆ తరువాతనే ఆమె హిందీ సినిమాలపై దృష్టి పెట్టింది. గతంలో ఆమె హిందీలో చేసిన రెండు సినిమాలు పరాజయం పాలయ్యాయి. దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆమె అజయ్ దేవగణ్ సరసన 'దే దే ప్యార్ దే' సినిమా చేసింది.

10 రోజుల్లో 75 కోట్లు సాధించిన ఈ సినిమా, 18 రోజులకి ఓవర్సీస్ కలుపుకుని 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. అజయ్ దేవగణ్ వంటి సీనియర్ స్టార్ హీరో సినిమాకి ఈ వసూళ్లు రావడానికి ఇన్ని రోజులు పట్టడం మరీ సంతోషించే విషయమేమీ కాదు. కానీ సుదీర్ఘకాలం తరువాత తన కల నెరవేరినందుకు మాత్రం రకుల్ సంతోషంతో తెగ మురిసిపోతోంది.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement