అన్నవరం దేవస్థానంలోనూ డ్రెస్‌కోడ్.. జూలై 1 నుంచి అమలు
Advertisement
అన్నవరం దేవస్థానంలో జూలై 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇకపై దేవాలయానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ వస్త్రాలు ధరించాల్సి ఉంటుంది. ఆధునిక వస్త్రధారణతో వచ్చే భక్తులకు చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆలయ ఈవో ఎంవీ సురేశ్ బాబు తెలిపారు. ఇకపై సత్యదేవుని దర్శనానికి వచ్చే పురుషులు పంచె-కండువా, కుర్తా-పైజమా ధరించాల్సి ఉంటుంది.

మహిళలు చీర-జాకెట్టు, లేదంటే పంజాబీ డ్రెస్-చున్నీ ధరించాలి. పిల్లలైతే లంగా-ఓణీ ధరించాల్సి ఉంటుందని సురేశ్ బాబు తెలిపారు. స్వామి ఆర్జిత సేవలు, నిత్యకల్యాణం, వ్రతాలు, దర్శనానికి సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి అని పేర్కొన్నారు. అలా రాని భక్తులను ఆలయంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు.
Mon, May 27, 2019, 07:09 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View