హైదరాబాద్‌లో దారుణం.. భార్య, కొడుకును హత్య చేసి పరారైన భర్త
Advertisement
ఉత్తరప్రదేశ్ నుంచి ఓ వ్యక్తి తన కుటుంబంతో కలిసి పది రోజుల క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చాడు. నేడు అతడు తన భార్య, కొడుకును హత్య చేసి పరారయ్యాడు. సనత్‌నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఉత్తరప్రదేశ్‌లోని దేవారియా గ్రామానికి చెందిన రాజేశ్‌కు అని భార్య ఊర్మిళ(27)కు గొడవలవుతుండటంతో గ్రామ పెద్దలు వీరి మధ్య రాజీ కుదిర్చారు. అనంతరం వీరు బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చి మూసాపేటలో నివాసముంటున్నారు. వీరితో పాటే వచ్చిన రాజేశ్‌ తోడల్లుడు దీపక్‌, అతని భార్య చంద కూడా అదే ఇంట్లో కలిసి నివాసముంటున్నారు.

ఆదివారం ఉదయం 9 గంటలకు దీపక్‌ దంపతులు డ్యూటీకి వెళ్లారు. మధ్యాహ్నం తిరిగి వచ్చేసరికి ఇంటికి తాళం వేసి ఉండటంతో దీపక్ పలు మార్లు రాజేశ్‌కు ఫోన్ చేశాడు. ఎంతకీ రాజేశ్ ఫోన్ ఎత్తకపోవడంతో దీపక్, ఇంటి తాళం పగులగొట్టి చూడగా ఊర్మిళ, ఆమె కొడుకు కిసాన్(7) రక్తపు మడుగులో పడి ఉన్నారు. ఊర్మిళను ఇనుపరాడ్డుతో మోది చంపినట్టు గుర్తించారు. కిసాన్ మృత దేహాన్ని బాత్రూంలో గుర్తించారు. పోలీసులు కేసు విచారిస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.  
Sun, May 26, 2019, 09:16 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View