పిడుగుపాటుకు శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు.. విజయనగరంలో ఒకరి మృతి
Advertisement
మరికొన్ని నిమిషాల్లో పిడుగు పడుతుందని ఆర్టీజీఎస్ హెచ్చరికలు జారీ చేసినట్టే శ్రీకాకుళం జిల్లాలో పిడుగులు పడ్డాయి. శ్రీకాకుళం జిల్లాల్లో పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. మరోవైపు పిడుగులు పడటంతో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం గురండి వద్ద ఇటుకలు తయారీ చేస్తున్న దశరధరావు, బూర్జ మండలం కొల్లివలసలో వీరన్న అనే వ్యక్తులు మృతి చెందారు. విజయనగరం జిల్లా కురుపాంలో మరో వ్యక్తి పిడుగుపాటుతో మృతి చెందారు.

Sun, May 26, 2019, 08:41 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View