'సీత'ను ఆదరించినందుకు అందరికీ థ్యాంక్స్: దర్శకుడు తేజ
Advertisement
కాజల్ ప్రధాన పాత్రధారిగా తేజ రూపొందించిన 'సీత' నిన్ననే థియేటర్లకు వచ్చింది. విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్  వస్తోంది. దాంతో ఈ సినిమా టీమ్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ వేదికపై తేజ మాట్లాడుతూ .. "సినిమా చూసిన వాళ్లంతా చాలా బాగుందని అంటున్నారు .. కాజల్ బాగా చేసిందని అభినందిస్తున్నారు.

 బెల్లంకొండ శ్రీనివాస్ చాలా బాగా చేశాడని ప్రశంసిస్తున్నారు. ఇంతకుముందు చేసిన సినిమాల వలన బెల్లంకొండ శ్రీనివాస్ కి మాస్ హీరోగా మంచి క్రేజ్ వుంది. ఈ సినిమాలో ఆయనను పూర్తి భిన్నంగా చూపించాను. దాంతో ఎలా రిసీవ్ చేసుకుంటారా అనే ఒక టెన్షన్ ఉండేది. కానీ అంతా ఆయన పాత్రలోని కొత్తదనాన్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. అభిషేక్ అగర్వాల్ గారు నాపై నమ్మకంతో ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నందుకు సంతోషంగా వుంది. ఈ విజయానికి కారకులైన ఆడియన్స్ కి థ్యాంక్స్ చెబుతున్నాను" అని అన్నారు. 
Sat, May 25, 2019, 04:00 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View