నాలో ఆ పొగరు అలాగే వుంది .. అందుకే ఫంక్షన్స్ కి కూడా వెళ్లను: దర్శకుడు తేజ
Advertisement
తేజ తాజా చిత్రంగా 'సీత' నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాజల్ ప్రధాన పాత్రధారిగా నటించిన ఈ సినిమాపై ఇండస్ట్రీలో అంచనాలు వున్నాయి. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో తేజ మాట్లాడుతూ, "గతంలో నాకు పొగరు అనే టాక్ వుంది .. నన్ను తమవైపుకు తిప్పుకోలేని కొంతమంది అలా ప్రచారం చేశారు. నేను అనుకున్న మార్గంలో ముందుకు వెళ్లడమే పొగరు అయితే .. అది ఇప్పటికీ అలాగే వుంది.

ఇక నేను ఏ సినిమా ఫంక్షన్స్ కి రానని కూడా చెప్పుకుంటూ వుంటారు. సినిమా ఫంక్షన్స్ కి వెళితే, మనకి ఇష్టం లేకపోయినా నవ్వాలి. వాళ్లను .. వీళ్లను పొగడాలి. మనసులో అభిమానం లేకపోయినా పైకి కౌగిలించుకోవాలి. ఇలాంటివి నాకు నచ్చవు .. అలవాటు లేదు కూడా. వున్నది వున్నట్టుగా మాట్లాడటమే నాకు తెలుసు .. అది చాలా మందికి నచ్చదు. అందుకే నా పని నేను చేసుకుంటూ వెళుతుంటాను" అని చెప్పుకొచ్చారు.
Sat, May 25, 2019, 02:48 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View