భయపెడుతూనే నవ్విస్తోన్న 'అభినేత్రి 2' ట్రైలర్
Advertisement
ప్రభుదేవా - తమన్నా జంటగా దర్శకుడు ఏ.ఎల్. విజయ్ గతంలో తెరకెక్కించిన 'అభినేత్రి' తెలుగులో మంచి వసూళ్లను రాబట్టింది. ఈ హారర్ థ్రిల్లర్ సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు 'అభినేత్రి 2' రూపొందింది. ఈ నెల 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి ముస్తాబవుతోంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఇటు ప్రభుదేవాను .. అటు తమన్నాను దెయ్యం ఆవహించినట్టుగా చూపించారు. ఈ ఇద్దరిలో ఎవరిని ఎప్పుడు దెయ్యం ఆవహిస్తుందో .. ఎప్పుడు వదిలేస్తుందో తెలియని అయోమయపు పాత్రలో కోవై సరళ కామెడీ నవ్విస్తుందన్న మాట. ఇక మరింత కామెడీ డోస్ పెంచడానికి సప్తగిరి ఉండనే వున్నాడు. 'అభినేత్రి' స్థాయిలో ఈ సీక్వెల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందేమో చూడాలి.
Sat, May 25, 2019, 12:16 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View