'బ్రోచేవారెవరురా' నుంచి లిరికల్ వీడియో సాంగ్
Advertisement
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నివేదా థామస్ ప్రధాన పాత్రధారిగా 'బ్రోచేవారెవరురా' రూపొందుతోంది. మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మితమవుతోన్న ఈ సినిమాలో, శ్రీవిష్ణు .. సత్యదేవ్ .. ప్రియదర్శి .. రాహుల్ రామకృష్ణ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగును విడుదల చేశారు.

"ఓ యే వగలాడి .. వగలాడి .. యే వగలాడి .. " అంటూ ఈ పాట సాగుతోంది. వివేక్ సాగర్ సంగీతం .. హసిత్ గోలి సాహిత్యం కథా నేపథ్యానికి తగినట్టుగా వున్నాయి. వివేక్ సాగర్ .. బాలాజీ .. రామ్ ఆలాపన కొత్తగా అనిపిస్తుంది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సినిమా నేపథ్యంలో సాగే ఈ వినోదభరిత చిత్రం ప్రేక్షకులను ఎంతవరకూ ఆకట్టుకుంటుందో చూడాలి.
Sat, May 25, 2019, 11:53 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View