సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Advertisement
*  అందాల కథానాయిక తమన్నా నటించిన హిందీ చిత్రం 'ఖామోషి' విడుదల వాయిదా పడింది. చక్రి తోలేటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని మొదట్లో ఈ నెల 31న విడుదల చేయాలనుకున్నారు. కారణాంతరాల వల్ల దీనిని వచ్చే నెల 14కి వాయిదా వేశారు. హారర్ చిత్రంగా రూపొందిన ఇందులో ప్రభుదేవా సైకో పాత్రలో నటించాడు.
*  ప్రస్తుతం 'గ్యాంగ్ లీడర్' చిత్రంలో నటిస్తున్న హీరో నాని దీని తర్వాత ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ఇందులో మిత్రధర్మం కోసం ఏదైనా సరే చేయగలిగే కర్ణుడి తరహా పాత్రను పోషిస్తాడట.
*  సొట్ట బుగ్గల చిన్నది తాప్సీ నటించిన త్రిభాషా చిత్రం 'గేమ్ ఓవర్' సెన్సార్ పూర్తయింది. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని వచ్చే నెల 14న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
Sat, May 25, 2019, 07:18 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View