తెలంగాణలో ఈ నెల 27న జరగాల్సిన మండల పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు వాయిదా!
Advertisement
తెలంగాణలో ఇటీవల మూడు దశల్లో జరిగిన మండల, జిల్లా పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపును వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 27న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల లెక్కింపు జరగాల్సి ఉంది. జులై నుంచి కొత్తగా ఎన్నికయ్యే మండల, జిల్లా ప్రజా పరిషత్‌ల పదవీకాలం ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు పూర్తయితే మొదటి సమావేశం కోసం మరో నెల పాటు ఆగాల్సి ఉంటుంది.

ఈ నెల రోజులలో చైర్ పర్సన్ల ప్రత్యక్ష ఎన్నికలకు సంబంధించి ఇబ్బందులు తలెత్తే అవకాశముందని భావించిన ప్రభుత్వం ఓట్ల లెక్కింపును వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. వీటన్నింటినీ పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీరాజ్ శాఖ అభిప్రాయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈసీ ఓట్ల లెక్కింపు తేదీని వాయిదా వేసింది. తదుపరి ఓట్ల లెక్కింపు తేదీపై నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి తరుపున కార్యదర్శి అశోక్ కుమార్ నేడు ఆదేశాలు జారీ చేశారు.
Fri, May 24, 2019, 09:34 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View