16వ లోక్ సభ రద్దుకు సిఫార్సు చేస్తూ కేంద్ర క్యాబినెట్ తీర్మానం
Advertisement
లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించిన నేపథ్యంలో 16వ లోక్ సభ రద్దుకు సిఫార్సు చేస్తూ కేంద్ర క్యాబినెట్ తీర్మానించింది. ఢిల్లీలో ఇవాళ కేంద్ర క్యాబినెట్ భేటీ జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ప్రధాని పదవికి రాజీనామా చేయాలని మోదీ నిర్ణయించుకున్నారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపిస్తున్నారు.

కాగా, లోక్ సభ రద్దు నేపథ్యంలో కేంద్ర మంత్రులకు రాత్రి ఏడున్నరకు రాష్ట్రపతి విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం అనంతరం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎంపీలు పార్లమెంటరీ పార్టీ నేతను ఎన్నుకుంటారు.
Fri, May 24, 2019, 06:26 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View