శర్వానంద్ కొత్త సినిమా నుంచి ఫస్టులుక్ వచ్చేస్తోంది
Advertisement
సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా ఒక సినిమా రూపొందుతోంది. విభిన్నమైన కథాకథనాలతో నిర్మితమవుతోన్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా చివరిదశకు చేరుకుంది. శర్వానంద్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్న ఈ సినిమా టైటిల్ ఏమిటనేది ఇంతవరకూ ప్రకటించలేదు. దాంతో అభిమానులంతా ఈ సినిమా ఫస్టులుక్ కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ఫస్టులుక్ పోస్టర్ రిలీజ్ కి ముహూర్తాన్ని ఖాయం చేశారు. ఈ సినిమా నుంచి టైటిల్ తో కూడిన ఫస్టులుక్ ను రేపు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకి విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ కొంతసేపటి క్రితం ఒక పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో శర్వానంద్ సరసన కథానాయికలుగా కాజల్ .. కల్యాణి ప్రియదర్శన్ కనిపించనున్నారు. 
Fri, May 24, 2019, 05:01 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View