సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Advertisement
*  తెలుగులో బిజీగా వున్న యువ కథానాయిక రష్మిక మందన అటు తమిళంలో కూడా బిజీ అవుతోంది. ఇప్పటికే కార్తీ సరసన ఓ చిత్రం చేస్తున్న ఈ ముద్దుగుమ్మకు తాజాగా విజయ్ సినిమా నుంచి ఆఫర్ వచ్చిందట.
*  ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'సాహో' చిత్రం కోసం హైదరాబాదులోని అన్నపూర్ణా స్టూడియోలో ఓ పాటను చిత్రీకరించనున్నారు. ఇందుకోసం భారీ సెట్ ను వేస్తున్నారు. ప్రభాస్, శ్రద్ధ కపూర్ జంటపై ఈ పాటను చిత్రీకరిస్తారు.
*  తమిళ సినిమాలలో కూడా నటించాలని వుందని అంటున్నాడు యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్. ఎవరైనా తమిళ నిర్మాతలు మంచి కథలతో వస్తే కనుక తప్పకుండా తమిళ సినిమాలు చేస్తానని చెప్పాడు. తేజ దర్శకత్వంలో రూపొందిన 'సీత' చిత్రంతో శ్రీనివాస్ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.
Fri, May 24, 2019, 07:13 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View