కకావికలమైన టీడీపీ.. 1982 తర్వాత ఘోర పరాభవం!
Advertisement
ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ కకావికలమైంది. పార్టీ ఏర్పాటు తర్వాత ఎన్నడూ ఎదురుకానంత ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత ఐదుసార్లు విజయం సాధించిన టీడీపీ.. నాలుగు సార్లు ఓటమి పాలైంది. 1989లో తొలిసారి ఓడిన టీడీపీకి అప్పట్లో 90 సీట్లు వచ్చాయి. ఆ తర్వాత 2004 ఎన్నికల్లో మరోమారు ఓటమి పాలైంది. అప్పుడు 47 సీట్లు మాత్రమే వచ్చాయి. 2009లో ఓడినా 90 సీట్లు వచ్చాయి. అప్పుడు రాష్ట్రం ఉమ్మడిగా ఉంది.

రాష్ట్రం విడిపోయిన తర్వాత టీడీపీకి ఇది తొలి ఓటమి. ఇప్పుడు కేవలం 23 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇక, లోక్‌సభ విషయానికొస్తే మూడంటే మూడు సీట్లు మాత్రమే గెలుచుకుంది.  నిష్పత్తి ప్రకారం చూసుకుంటే 2004లో కంటే టీడీపీకి వచ్చిన సీట్లు బాగా తగ్గాయి. అదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సునామీ సృష్టించింది. జగన్ ప్రభంజనంతో కొన్ని జిల్లాలలో టీడీపీ ఖాతా కూడా తెరవలేకపోయింది.
Fri, May 24, 2019, 06:16 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View