పొట్లూరి వరప్రసాద్ రాజకీయ ఆశలకు గండికొట్టిన కేశినేని నాని... విజయవాడ లోక్ సభ స్థానం టీడీపీ వశం
Advertisement
తెలుగుదేశం పార్టీ లోక్ సభ ఎన్నికల్లో  విజయవాడ స్థానాన్ని నిలబెట్టుకుంది. విజయవాడ లోక్ సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని తన ప్రత్యర్థి, వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ పై విజయం సాధించారు. సినీ నిర్మాత, ప్రముఖ వ్యాపారవేత్త అయిన పొట్లూరి వరప్రసాద్ ఇటీవలే మహర్షి చిత్రంతో మాంచి ఊపుమీదున్నారు. గతకొంతకాలంగా రాజకీయరంగంపై కన్నేసిన ఆయన ఎలాగైనా నెగ్గాలన్న పట్టుదలతో వైసీపీ టికెట్ అందుకున్నారు. కానీ, విజయవాడలో ఎంతో పట్టు ఉన్న కేశినేని ముందు నిలవలేకపోయారు.
Thu, May 23, 2019, 11:01 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View