కారు, సారు, పదహారు అంటూ 9 సీట్లతో సరిపెట్టుకున్న టీఆర్ఎస్
Advertisement
అసెంబ్లీ ఎన్నికల్లో గంపగుత్తగా ఓట్లు కొల్లగొట్టిన టీఆర్ఎస్ పార్టీ అదే ఒరవడి లోక్ సభ ఎన్నికల్లోనూ కనిపిస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే, తెలంగాణ ఓటర్లు టీఆర్ఎస్ కు ఓ మోస్తరు సంఖ్యలో సీట్లను ఇవ్వడం గమనార్హం. టీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో చక్రం తిప్పే ఉద్దేశంతో కారు, సారు, పదహారు అంటూ ఏకంగా 17 సీట్లలో 16 సీట్లకు గురిపెట్టింది. ఈసారి కేసీఆర్ మ్యాజిక్ పనిచేయలేదు. టీఆర్ఎస్ కు సార్వత్రిక ఎన్నికల్లో 9 లోక్ సభ స్థానాలు మాత్రమే దక్కాయి. మరోవైపు కాంగ్రెస్ 3, బీజేపీ 4, ఎంఐఎం ఒక్క స్థానంలో విజయం సాధించాయి.
Thu, May 23, 2019, 10:45 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View