ప్రధాని మోదీకి ప్రపంచనేతల అభినందనలు
Advertisement
ప్రపంచపు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరుగాంచిన భారత్ లో సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన సంగతి తెలిసిందే. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే 350కి పైగా స్థానాలతో అఖండ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో, ప్రధాని మోదీకి ప్రపంచనేతలు శుభాభినందనలు తెలియజేశారు.

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా దేశాధినేత జీ జిన్ పింగ్, సైప్రస్ అధ్యక్షుడు నికోస్ అనస్తాసియాడెస్, ఆప్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఇటలీ అధ్యక్షుడు గిస్సెపీ కాంటే, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే, పోర్చుగల్ ప్రధాని ఆంటోనియో కోస్టాలతో పాటు నేపాల్, భూటాన్ దేశాల అధినేతలు సైతం మోదీకి అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ట్వీట్లు చేయగా, మోదీ వినమ్రంగా అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకున్నారు.
Thu, May 23, 2019, 10:12 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View