జగన్‌కి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి
Advertisement
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న వైసీపీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కాసేపటి క్రితం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయనకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. తెలుగు ప్రజల ప్రయోజనాల కోసం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో తన సహకారం ఎప్పుడూ ఉంటుందని వెంకయ్యనాయుడు తెలిపారు. ఈ నెల 30న విజయవాడలో జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వైసీపీ ఘన విజయం సాధించడం పట్ల వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
Thu, May 23, 2019, 09:57 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View