ఏపీలో వైసీపీ ప్రభంజనం సృష్టించింది: బొత్స సత్యనారాయణ
Advertisement
ఏపీలో వైసీపీ ప్రభంజనం సృష్టించిందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ సంతోషం వ్యక్తం చేశారు. చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించిన బొత్స మీడియాతో మాట్లాడుతూ, జగన్ గెలుపును ఓ సునామీగా అభివర్ణించారు. ప్రజలకు జగన్ పై ఉన్న నమ్మకం వల్లే ఇంతటి భారీ విజయం తమకు లభించిందని అన్నారు. జగన్ నాయకత్వంలోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని చెప్పిన బొత్స, టీడీపీ పాలనకు భిన్నంగా తమ పాలన ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై బొత్స విమర్శలు గుప్పించారు.
Thu, May 23, 2019, 09:56 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View