రాజస్థాన్‌ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర సంఘటన
Advertisement
రాజస్థాన్‌లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తనయుడు వైభవ్ గెహ్లాట్ పరాజయం పాలవగా, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే తనయుడు దుష్యంత్ సింగ్ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఝలావర్-బరన్ స్థానం నుంచి వసుంధర రాజే తనయుడు దుష్యంత్ సింగ్ ఘన విజయం సాధించారు.

ఏకంగా 4,53,928 ఓట్ల మెజారిటీతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పటి వరకూ వెలువడిన ఎన్నికల ఫలితాలను బట్టి రాజస్థాన్‌లో 17 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ విజయం సాధించగా, మరో ఏడు స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. కాంగ్రెస్ ఇప్పటి వరకూ ఖాతాను కూడా తెరవలేదు. ఇక రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ కేవలం ఒక్క స్థానంలో విజయం సాధించింది.
Thu, May 23, 2019, 09:47 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View