గన్నవరం ఎయిర్ పోర్టులో జగన్ కు ఘనస్వాగతం
Advertisement
రేపు ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ కొద్దిసేపటి క్రితం విజయవాడ చేరుకున్నారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ నివాసం నుంచి హెలికాప్టర్ లో బయల్దేరిన ఆయనకు విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం లభించింది. విజయంపై ధీమాతో ఉన్న వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని జై జగన్, సీఎం సీఎం నినాదాలతో హోరెత్తించాయి.

విమానాశ్రయం లాబీల్లోనే జగన్ ను కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో చుట్టుముట్టి ఆయనకు ముందస్తు అభినందనలు తెలిపేందుకు ప్రయత్నించారు. అయితే జగన్ వారందరికీ వినమ్రంగా నమస్కరిస్తూ తన కారులో ఎక్కి భారీ కాన్వాయ్ వెంట రాగా రాజధానిలోని తన నివాసానికి తరలివెళ్లారు. రేపు ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా విజయవాడలోని పార్టీ ఆఫీసు నుంచి లెక్కింపు తీరుతెన్నులు పరిశీలిస్తారని తెలుస్తోంది.
Wed, May 22, 2019, 07:13 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View