స్వలింగ సంబంధంలో ఉన్నట్టు వెల్లడించిన ద్యుతీపై తెలుగు సినీ దర్శకుడి స్పందన
Advertisement
భారత మహిళా అథ్లెటిక్స్ రంగంలో ఆశాకిరణంగా పేరుగాంచిన ద్యుతీచంద్ తాను స్వలింగ సంబంధంలో ఉన్నానంటూ ప్రకటించి ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన గ్రామానికే చెందిన మరో అమ్మాయితో రిలేషన్ షిప్ మెయింటైన్ చేస్తున్నానంటూ ద్యుతీ తన ప్రకటనలో పేర్కొంది. ద్యుతీ ప్రకటనతో కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ద్యుతీతో సంబంధంలో ఉన్న అమ్మాయి తనకు మనవరాలు అవుతుందని ద్యుతీ తల్లి పేర్కొంది.

అయితే, టాలీవుడ్ యువ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. ద్యుతీ నువ్వు నిజమైన విజేతవు అంటూ ట్వీట్ చేశారు. ద్యుతీ తన కెరీర్ లో ఎదురైన సమస్యలను, తన వ్యక్తిగత అభిప్రాయాలను చెప్పిన తీరు స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. 23 ఏళ్ల లేత ప్రాయంలోనే ఎన్నో కఠినసవాళ్లను ఎదుర్కొన్న ద్యుతీ అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించిందని రాహుల్ రవీంద్రన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
Wed, May 22, 2019, 06:32 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View