ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమైతే ఈవీఎంలలో అక్రమాలు జరిగినట్టే: కేఏ పాల్
Advertisement
ప్రముఖ శాంతి ప్రబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి తెరపైకి వచ్చారు. ఓ చానల్ కు లైవ్ లో అందుబాటులోకి వచ్చిన పాల్ తాజా పరిణామాలపై తనదైన శైలిలో స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమైతే ఈవీఎంలలో అక్రమాలు జరిగినట్టే భావించాలని అన్నారు. చాలా ప్రాంతాల్లో ఒక పార్టీకి ఓటేస్తే మరో పార్టీకి పడిందని ఆరోపించారు. ఏపీలో నిజానికి 30 స్థానాల్లో రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం ఉందని పాల్ స్పష్టం చేశారు.

ఎన్నికల కమిషనర్ ను అందరికంటే ఎక్కువగా నిలదీసింది తానేనని చెప్పుకొచ్చారు. అసలు నీకు బుద్ధుందా? అని ఎలక్షన్ కమిషనర్ ను ప్రశ్నించానని, తనలాగా ఆయనను ఎవరైనా అలా అనగలరా? అని అడిగారు. అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టే ఈసీని ప్రశ్నించగలిగానని వివరించారు. చంద్రబాబు తానే మేధావినని భావిస్తారని, కానీ ఆయన దారుణంగా వైఫల్యం చెందారని విమర్శించారు.
Wed, May 22, 2019, 05:58 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View