ఈవీఎంలను అవమానించడమంటే దేశ ప్రజలను అవమానించడమే: విపక్షాలపై అమిత్ షా ఫైర్
Advertisement
రేపు ఓట్ల లెక్కింపు రోజున ముందుగా 5 వీవీప్యాట్స్ లెక్కింపు చేపట్టాలని విపక్ష పార్టీల డిమాండ్ ను కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించిన విషయం తెలిసిందే. సీఈసీ నిర్ణయంపై విపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. బీజేపీతో సీఈసీ కుమ్మక్కైందని ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మండిపడ్డారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈవీఎంలను అవమానించడమంటే దేశ ప్రజలను అవమానించడమేనని వ్యాఖ్యానించారు. ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఒక్కరోజు ముందు ఓ జాతీయ పార్టీ ఓట్ల లెక్కింపును ఎలా ప్రశ్నిస్తుందంటూ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. 
Wed, May 22, 2019, 05:50 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View