బన్నీకి చెల్లెలి పాత్రలో నివేదా థామస్ అంటూ ప్రచారం, క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
Advertisement
త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతోంది. త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన కథానాయికగా పూజా హెగ్డేను తీసుకున్నారు. ఆయన తల్లిపాత్రలో 'టబు' నటిస్తోంది.

 ఈ సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలి పాత్రకి కూడా చాలా ప్రాధాన్యత వుంటుందట. అందువలన నివేదా థామస్ ను ఎంపిక చేశారనే టాక్ వినిపించింది. క్రేజీ ప్రాజెక్టు కావడం వలన నివేదా థామస్ ఈ పాత్రను చేయడానికి అంగీకరించిందని చెప్పుకున్నారు. ఈ ప్రచారం మరింత జోరందుకోవడంతో నివేదా థామస్ స్పందించింది. ఈ సినిమా కోసం తనని ఎవరూ సంప్రదించలేదనీ, ఈ సినిమాలో తను చెల్లెలి పాత్రను చేయనున్నాననే వార్తలో నిజం లేదని స్పష్టం చేసింది. ఇలా నివేదా థామస్ పుకార్లకు తెరదింపేసింది.
Wed, May 22, 2019, 05:32 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View