తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల కోసం ‘దోస్త్’ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలో డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాల కోసం ‘దోస్త్’ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ క్రమంలో రేపటి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. జూన్ 3 వరకూ మొదటి విడత రిజస్ట్రేషన్లకు సమయం ఉంది. గతంలో విడుదలైన నోటిఫికేషన్‌ను దోస్త్ కమిటీ వాయిదా వేసింది.

ఇంటర్‌లో ఫెయిల్ అయిన విద్యార్థుల జవాబు పత్రాలతో పాటు రీ వెరిఫికేషన్ ఫలితాలను ఈ నెల 27న విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించడంతో నోటిఫికేషన్‌ను వాయిదా వేసింది. తిరిగి నోటిఫికేషన్‌ను నేడు విడుదల చేసింది. మూడు విడతలలో సీట్ల కేటాయింపు అనంతరం జూలై 1 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి. 
Wed, May 22, 2019, 05:30 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View