'ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి' అంటూ జగన్ నివాసం వద్ద బ్యానర్లు!
Advertisement
ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు మరో రోజు సమయం ఉన్నా, వైసీపీ నేతలు అప్పుడే జగన్ సీఎం అంటూ సందడి చేస్తున్నారు. రాజధాని అమరావతిలో జగన్ నివాసం వద్ద కనిపించిన ఓ బ్యానరే అందుకు నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు అంటూ భారీ బ్యానర్ ఏర్పాటు చేశారు. పెద్దాపురం వైసీపీ నేత దవులూరి దొరబాబు ఈ బ్యానర్ ను తయారుచేయించారు.

దొరబాబు అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దాపురం సీటు ఆశించి నిరాశకు గురయ్యారు. అయినాగానీ, జగన్ పై తన అభిమానాన్ని చాటుకునేందుకు ఇలా ప్రయత్నించారు. సామాజిక మాధ్యమాల్లో ఈ బ్యానర్ విపరీతంగా సందడి చేస్తోంది.
Wed, May 22, 2019, 05:30 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View