సీఈసీ నిర్ణయంపై లోకేశ్ అసంతృప్తి!
Advertisement
ఓట్ల లెక్కింపులో భాగంగా ఈవీఎంల కంటే ముందు వీవీ ప్యాట్లను లెక్కించాలన్న విపక్షాల డిమాండ్ ను కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) తిరస్కరించింది. సీఈసీ తీసుకున్న ఈ నిర్ణయంపై ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశంలోని మెజార్టీ పార్టీల డిమాండ్ ను విస్మరించిన ఈసీ, ఎవరి పక్షాన నిలబడిందో ఈ నిర్ణయం ద్వారా మరోసారి స్పష్టమైందని విమర్శించారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం నిజమైన, న్యాయమైన డిమాండ్ ను ఎటువంటి కారణం లేకుండా పక్కనపెట్టిందని, భారత ప్రజాస్వామ్యంలో ఇది చీకటి రోజు అని లోకేశ్ విమర్శించారు.
Wed, May 22, 2019, 05:13 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View