'సాహో' పోస్టర్ తో కొత్త రికార్డును సృష్టించిన ప్రభాస్
Advertisement
ప్రభాస్ తాజా చిత్రంగా 'సాహో' రూపొందుతోంది. సుజిత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా 250 కోట్లకి పైగా బడ్జెట్ తో నిర్మితమవుతోంది. శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను, ఆగస్టు 15వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ తన ఇన్స్టా గ్రామ్ అకౌంట్ నుంచి నిన్న 'సాహో' పోస్టర్ ను రిలీజ్ చేశాడు.

 ఏప్రిల్ 17వ తేదీన ప్రభాస్ తన ఇన్స్టా గ్రామ్ అకౌంట్ ను క్రియేట్ చేయగా, నెల రోజుల్లోనే ఫాలోవర్ల సంఖ్య 1.8 మిలియన్ కి చేరుకుంది. ఈ అకౌంట్ నుంచే ప్రభాస్ నిన్న 'సాహో' పోస్టర్ ను వదలగా, 24 గంటలు గడిచేసరికి 7.96 లక్షల మంది ఈ పోస్టర్ ను లైక్ చేశారు. ఇన్స్టా గ్రామ్ ద్వారా ఒక తెలుగు పోస్టర్ ఈ స్థాయి లైక్స్ ను దక్కించుకోవడం ఇదే మొదటిసారి. అలా ప్రభాస్ 'సాహో' పోస్టర్ తోనే కొత్త రికార్డును నమోదు చేశాడు. ఇక టీజర్లు .. ట్రైలర్లు ఏ రేంజ్ లో షాకిస్తాయో చూడాలి. 
Wed, May 22, 2019, 05:05 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View