ఎన్నికల ఫలితాల ముందురోజు ఆచితూచి ట్రేడింగ్.. లాభాల్లోనే ముగింపు!
Advertisement
దేశవ్యాప్తంగా ఎన్నికల మేనియా నెలకొన్న తరుణంలో స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. రేపు ఫలితాలు వెలువడనుండడంతో ట్రేడర్లు ఎంతో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకున్నారు. కొనుగోళ్లు, అమ్మకాలు కూడా ఎంతో మందకొడిగా సాగాయి. ఈ నేపథ్యంలో, చివరకు బీఎస్ఈ సెన్సెక్స్ 140 పాయింట్ల లాభంతో 39,110 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 29 పాయింట్ల లాభంతో 11,738 వద్ద క్లోజయింది. మధ్యాహ్నం సెషన్ తర్వాత నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ లు పతనం దిశగా సాగాయి.

అన్నింటికంటే ఆశ్చర్యకరమైన పరిణామం ఏంటంటే, కొంతకాలంగా నష్టాలతో సహవాసం చేస్తున్న జెట్ ఎయిర్ వేస్ కు మంచిరోజులు వస్తున్నాయన్న వార్తల నేపథ్యంలో ఆ సంస్థ షేర్లకు గిరాకీ ఏర్పడింది. వరుసగా మూడో రోజు కూడా జెట్ ఎయిర్ వేస్ షేర్లు లాభాల బాటలో పయనించాయి. వారం రోజుల వ్యవధిలో జెట్ షేర్ల లాభాల్లో 32 శాతం పెరుగుదల నమోదైంది.
Wed, May 22, 2019, 05:04 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View