"క్షమించండి..." అంటూ ఐశ్వర్యరాయ్ ఫొటోను డిలీట్ చేసిన వివేక్ ఒబెరాయ్!
Advertisement
ఒపీనియన్ పోల్స్ అంటూ సల్మాన్ ఖాన్ తో, ఎగ్జిట్ పోల్స్ అంటూ తనతో, రిజల్ట్స్ అంటూ అభిషేక్ బచ్చన్, ఆరాధ్యలతో ఐశ్వర్యరాయ్ ఉన్న ఫొటోను ట్వీట్ చేసి, పలువురి ఆగ్రహానికి గురైన బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ దిగొచ్చాడు. ఆ మీమ్ ను డిలీట్ చేసిన వివేక్, ఐశ్వర్యకు క్షమాపణలు చెప్పాడు.

ఈ క్రమంలో తాజాగా మరో ట్వీట్ పెట్టిన ఆయన, "ఒక్కోసారి కొన్ని విషయాలు చూడగానే మనకు వినోదాన్ని కలిగిస్తాయి. అవే కొందరికి అలా అనిపించకపోవచ్చు. గడచిన పది సంవత్సరాల్లో దాదాపు రెండు వేల మందికి పైగా పేద ఆడపిల్లల బాధ్యతను తీసుకున్నాను. అటువంటి నేను ఓ మహిళ పట్ల ఇంత నీచానికి దిగజారడాన్ని ఊహించలేను. ఎవరో సృష్టించిన ఓ ఫొటోపై నేను సరదాగా సమాధానం ఇవ్వడం వల్ల ఆ మహిళ బాధపడుంటే నన్ను క్షమించాల్సిందిగా కోరుతున్నాను. ఆ ట్వీట్‌ ను తొలగించేశాను" అని వివేక్ వ్యాఖ్యానించాడు. కాగా, వివేక్ ట్వీట్ పై మహారాష్ట్ర మహిళా కమిషన్ కేసు నమోదు చేసింది.
Tue, May 21, 2019, 10:51 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View