తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి ప్రస్తావించిన లగడపాటి
Advertisement
ఎన్నికల ఫలితాలపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి ఆయన ప్రస్తావించారు. ఏపీకి ‘ప్రత్యేక హోదా’కు మద్దతు ఇస్తానని ఎన్నికల సమయంలో కేసీఆర్ పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. ప్రత్యేక హోదా విషయమై ఏపీకి మద్దతిస్తానన్న కేసీఆర్ కు తన అభినందనలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గురించీ లగడపాటి ప్రస్తావించారు. పవన్ కల్యాణ్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఉన్నారని, కులాలకు అతీతంగా ఆయన్ని అభిమానించే వారున్నట్టు చెప్పారు. ఈ ఎన్నికల్లో ఎక్కువ శాతం యువత ‘జనసేన’ వైసీపీ కు తమ ఓట్లు వేసి ఉంటాయని భావించారు.
Sun, May 19, 2019, 08:00 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View