న్యూస్18: ఏపీ లోక్ సభ స్థానాల్లో వైసీపీకి 13-14, టీడీపీకి 10-12 స్థానాలు..
దేశవ్యాప్తంగా ఓ సంకుల సమరం ముగిసి మరో ఉత్సాహభరిత అంకానికి తెరలేచింది. సార్వత్రిక ఎన్నికల తంతు ముగిసి మే 23న ఎన్నికల ఫలితాలకు యావత్ భారతదేశం ఎదురుచూస్తున్న తరుణంలో ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. ఈ క్రమంలో ఏపీలో ఆసక్తికర ఫలితాలు రానున్నట్టు న్యూస్18 జాతీయ మీడియా సంస్థ సర్వే చెబుతోంది. ఏపీలో 25 లోక్ సభ స్థానాలు ఉండగా, ఓటర్లు ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం ఇవ్వలేదని ఎగ్జిట్ పోల్స్ అంచనాలను బట్టి అర్థమవుతోంది.

టీడీపీకి కాస్త నిరాశ కలిగిస్తూ 10 నుంచి 12 సీట్లు, వైసీపీకి కాస్త మెరుగ్గా 13 నుంచి 14 స్థానాలు వచ్చే అవకాశం ఉందని న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్ వివరించాయి.  ఏపీలో అత్యధిక స్థానాలు గెలవడం ద్వారా కేంద్రంలో  కింగ్ మేకర్ అవ్వాలని భావిస్తున్న చంద్రబాబుకు ఈ ఫలితాలు నిజమైన పక్షంలో, నిరాశ తప్పదని భావించాలి. పైగా, కేంద్రం మెడలు వంచైనా ఏపీకి ప్రత్యేక హోదా సాధించాలని భావిస్తున్న ఆయనకు తీవ్ర విఘాతం అని చెప్పాలి. 
Sun, May 19, 2019, 07:13 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View