రూ. 27 కోట్ల లాటరీ కొట్టిన ఎన్నారై... చెబుదామంటే ఆచూకీ ఎక్కడ?
05-05-2019 Sun 09:59
- యూఏఈలో బిగ్ టికెట్ సిరీస్ డ్రా
- శోభిత్ కు తగిలిన జాక్ పాట్
- ఎక్కడున్నాతో తెలీదంటున్న నిర్వాహకులు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఇండియన్ సంతతికి చెందిన శోభిత్ అనే యువకుడు జాక్ పాట్ కొట్టాడు. అబూదాబిలో పన్నులు లేని బిగ్ టికెట్ సిరీస్ డ్రా జరుగగా, శోభిక్ కు 4 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 27 కోట్లు) లాటరీ తగిలింది. శోభిత్ ఈ టికెట్ ను గత నెల 1వ తేదీన కొన్నాడు. ఈ లాటరీ యూట్యూబ్ లో లైవ్ కూడా వచ్చింది. కానీ, శోభిత్ ఎక్కడున్నాడన్న విషయం మాత్రం లాటరీ నిర్వాహకులు ఇంతవరకూ కనుగొనలేదు.
శోభిత్ కు పలుమార్లు ఫోన్ చేసినా, ఆయన స్పందించలేదని, అతని ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని నిర్వాహకులు వెల్లడించారు. ఆయన ఎక్కడ నివసిస్తారో తమకు తెలుసునని ఇంటికి వెళ్లి విషయం చెప్పి వస్తామని డ్రా నిర్వహించిన రిచర్డ్ తెలిపారు. ఇదే డ్రాలో ఇండియాకు చెందిన మంగేశ్ అనే వ్యక్తి బీఎండబ్ల్యూ 220ఐ కారును గెల్చుకున్నారని ఆయన అన్నారు.
More Latest News
తెలంగాణ డీజీపీ ఫొటోను వాట్సప్ డీపీగా పెట్టి.. పోలీసులనే డబ్బు అడిగిన సైబర్ నేరగాళ్లు!
22 minutes ago

హీరో శ్రీకాంత్, ఊహల కూతురు ఇప్పుడు ఎలా ఉందో చూడండి!
39 minutes ago

రామ్ హీరోగా హరీశ్ శంకర్ సినిమా!
1 hour ago

మహారాష్ట్రలో మలుపు తిరుగుతున్న రాజకీయం.. ఎంఎన్ఎస్ అధినేత రాజ్ థాకరేకు ఏక్నాథ్ షిండే ఫోన్!
1 hour ago

దేశంలో మళ్లీ 17వేల కరోనా కొత్త కేసులు
2 hours ago
