నేను గెలిస్తే.. హైదరాబాద్-అమరావతికి రైలు మార్గం తీసుకొస్తా: కోమటిరెడ్డి వెంకట రెడ్డి
26-04-2019 Fri 19:42
- రెండు రాజధానుల మధ్య సులభ రవాణా ఉండాలి
- అందుకే, ఈ రైలు మార్గం తీసుకొస్తా
- స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలి

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి నుంచి ఎంపీగా పోటీ చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంపీగా తాను గెలిస్తే హైదరాబాద్ నుంచి సూర్యాపేట మీదుగా అమరావతికి రైలు మార్గం తీసుకొస్తానని అన్నారు. పోచంపల్లిలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రెండు తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య సులభమైన రవాణా కోసం ఈ రైలు మార్గం తీసుకొస్తానని చెప్పారు. మూసీ నీటిని శుద్ధి చేయడానికి నదిపై ట్రీట్ మెంట్ ప్లాంట్ల ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఆయన ప్రస్తావిస్తూ, ప్రభుత్వం సరిగా పనిచేయాలంటే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బుద్ధి చెప్పి తమ పార్టీకి పట్టం కట్టాలని కోరారు.
More Latest News
రూ.1000 కోట్ల తాయిలాలు పొందిన తర్వాతే డాక్టర్లు డోలో-650 రాస్తున్నారంటూ పిటిషన్... విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు
45 minutes ago

తెలంగాణలో తాజాగా 435 మందికి కరోనా పాజిటివ్
2 hours ago

బాయ్ కాట్ ట్రెండ్ పై అర్జున్ కపూర్ వ్యాఖ్యలు... నీ పని నువ్వు చూస్కో అంటూ మధ్యప్రదేశ్ మంత్రి కౌంటర్
2 hours ago

టాలీవుడ్ వాళ్లు షూటింగులు ఆపేసి ఏం చేస్తున్నారని బాలీవుడ్ వాళ్లు ఆరా తీస్తున్నారు: దిల్ రాజు
4 hours ago
