తన తండ్రి బయోపిక్ కోసం రంగంలోకి దిగిన సీనియర్ హీరోయిన్ రాధిక
Advertisement
ఎంజీఆర్ .. శివాజీ గణేశన్ వంటి స్టార్ హీరోలు తమిళ చిత్రపరిశ్రమను ఏలుతున్నప్పుడు, విలన్ గా ఎంఆర్ రాధ తనదైన ముద్రవేశాడు. పేరుకి ఆయన విలన్ అయినప్పటికీ, తమిళనాట హీరోలతో సమానమైన క్రేజ్ ఆయనకి వుండేది. ఎంఆర్ రాధ ఒకానొక సమయంలో ఎంజీఆర్ పై కాల్పులు జరపడం సంచలనాత్మకమైంది.

ఇలా ఎంఆర్ రాధ జీవితంలో ఎన్నో అనూహ్యమైన మలుపులు వున్నాయి. రాధిక, నిరోషా ఆయన కూతుళ్లే .. కాకపోతే తల్లులు వేరు. ఇక రాధారవి .. ఎంఆర్ రాధ తనయుడే. అంతా కూడా తమిళ చిత్రపరిశ్రమలో బాగా స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో ఎంఆర్ రాధ బయోపిక్ ను తన సొంత బ్యానర్లో నిర్మించడానికి రాధిక రంగంలోకి దిగారు. ఎంఆర్ రాధ పాత్ర కోసం శింబును .. ఎంజీఆర్ పాత్రకి గాను అరవిందస్వామిని ఎంపిక చేసినట్టుగా సమాచారం. ఎంఆర్ రాధ మనవడైన 'ఐకీ' ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తాడట.
Fri, Apr 26, 2019, 11:48 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View