జూనియర్ పై లాయర్ లైంగిక వేధింపులు... పోలీసులు వెళితే హార్పిక్ తాగి ఆత్మహత్యాయత్నం!
తన వద్ద పని చేస్తున్న జూనియర్ న్యాయవాదిని లైంగిక వేధింపులకు గురి చేసిన ఓ న్యాయవాది, పోలీసులను చూసి బాత్ రూమ్ లోకి పరిగెత్తి, అక్కడున్న హార్పిక్ ను తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని చిలకలగూడలో జరిగింది. రామారావు అనే న్యాయవాది వద్ద ఓ యువతి జూనియర్ గా పనిచేస్తోంది. రామారావు తనను వేధిస్తున్నాడంటూ ఆమె పోలీసులను ఆశ్రయించగా, అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. పోలీసులను చూసిన రామారావు, హార్పిక్ ను తాగగా, వెంటనే స్పందించిన పోలీసులు, ఆయన్ను అపోలో ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే రామారావుపై కేసు నమోదు చేశామని, విచారిస్తున్నామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. 
Fri, Apr 26, 2019, 11:19 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View