'భారత్'లో స్లోమోషన్ పాట రిహార్సల్స్ లో నడుముపట్టేసి నడవనీయలేదు: దిశా పటానీ
Advertisement
సల్మాన్ ఖాన్ .. కత్రినా కైఫ్ .. దిశా పటానీ ప్రధాన పాత్రధారులుగా అలీ అబ్బాస్ జాఫర్ 'భారత్' సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాను జూన్ 5వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈ సినిమాలో సల్మాన్ .. దిశా కాంబినేషన్లో ఒక స్లోమోషన్ సాంగ్ వుంది. ఇటీవల వదిలిన ఈ సాంగ్ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది.

ఈ సాంగ్ చిత్రీకరణ సమయంలో తాను పడిన కష్టాలను గురించి తాజాగా దిశా స్పందిస్తూ .. "స్లో మోషన్ పాటలో మూమెంట్స్ కోసం జిమ్నాస్టిక్స్ ను కూడా కొన్నిరోజుల పాటు ప్రాక్టీస్ చేయవలసి వచ్చింది. ఆ సమయంలో నా మోకాలికి గాయం కావడమే కాకుండా నడుము పట్టేసింది. ఎటూ కదల్లేని పరిస్థితి .. వారం రోజుల పాటు బెడ్ కే పరిమితమైపోయాను. రాత్రివేళలో షూటింగ్ మొదలై, తెల్లవారుజామువరకూ ఈ పాట చిత్రీకరణ జరిగేది. ఇది నాకు ఇంకా ఇబ్బందిని కలిగించే విషయం, అయినా షూటింగ్ సమయంలో మోకాలి దగ్గర ఐస్ పెట్టుకుంటూ .. బాధతోనే ఆ పాటను పూర్తిచేశాను. ఇప్పుడు ఈ పాటకి లభిస్తున్న ఆదరణ నా కష్టాన్ని మరిచిపోయి .. ఆనందించేలా చేస్తోంది" అని చెప్పుకొచ్చింది. 
Fri, Apr 26, 2019, 11:14 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View