100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టిన 'కాంచన 3'
Advertisement
లారెన్స్ కథానాయకుడిగా ఆయన దర్శకత్వంలోనే 'కాంచన 3' రూపొందింది. తెలుగు .. తమిళ భాషల్లో ఈ నెల 19వ తేదీన ఈ సినిమా విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా 2600 థియేటర్స్ లో ఈ సినిమాను రిలీజ్ చేశారు. రెండు భాషల్లోను తొలిరోజునే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బి - సి సెంటర్స్ లో భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది.

తొలివారం రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల మార్క్ ను క్రాస్ చేసేసింది. ఇంకా ఈ సినిమా వసూళ్ల పరంగా అదే జోరును కొనసాగిస్తూ ఉండటం విశేషం. ఈ సినిమాలో లారెన్స్ సరసన వేదిక .. ఓవియా.. నిక్కీ తంబోలి కథానాయికలుగా నటించారు. కథాకథనాలు .. లారెన్స్ చిత్రీకరణ ఈ సినిమా సక్సెస్ లో ప్రధానమైన పాత్రను పోషించాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా ఇంతటి ఘన విజయాన్ని సాధించడంతో, 'కాంచన 4'కి లారెన్స్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పాడు.
Fri, Apr 26, 2019, 10:44 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View